హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):పర్యావరణ హితం కోసం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నది ప్రతి ఏటా లక్ష మట్టి వినాయక ప్రతిమలను హెచ్ఎండిఏ ఉచితంగా ప్రజానీకానికి పంపిణీ చేస్తున్నది. ఏడాది లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం పురపాలక శాఖ మంత్రి కే.టి. రామారావు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీమతి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. తదుపరి తెలంగాణ సచివాలయంలో ఎంఏయుడి స్పెషల్ సిఎస్, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కి వినాయక మట్టి ప్రతిమను అందజేశారు.
గురువారం 14వ తేదీ నుండి వరుసగా నాలుగు రోజులపాటు 24వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జంట నగరాలలోని 40 కేంద్రాలలో హెచ్ఎండిఏ వినాయక మట్టి ప్రతిమలను హెచ్ఎండిఏ యంత్రాంగం పంపిణీ చేస్తుంది