హైదరాబాద్ సెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ ): గ్రూప్`1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ జూన్ 11న గ్రూప్`1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్`1 ప్రిలిమ్స్ రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేసారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పిటిషన్లు అనుమానం వ్యక్తం చేసారు. హల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థుల వాదన. అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి తీసుకొని గ్రూప్`1 పరీక్షలపై హైకోర్టు తీర్పు నిచ్చింది.
0 కామెంట్‌లు