హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఇయ్యాల తెలంగాణ) : గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. డివిజన్ బెంచ్ తీర్పుపై చర్చించిన కమిషన్ సభ్యులు.. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు అభ్యర్థులు వేసిన కేసు ద్వారా లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకూ ఏ ఎగ్జామ్ కూ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదని, గ్రూప్1 ప్రిలిమ్స్ కు మాత్రం ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినట్టు కమిషన్ అధికారులు చెప్తున్నారు. ముందుగా జరిగిన పరీక్షలో కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు రావడం వల్లే రెండోసారి పెట్టిన పరీక్షకు బయోమెట్రిక్ నిర్వహించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హాల్ టికెట్ లోనూ వెల్లడిరచామన్నారు. అయితే, హైకోర్టు జడ్జిమెంట్ కాపీ అందకపోవడంతో పాటు ఇద్దరు కమిషన్ సభ్యులు విూటింగుకు హాజరుకాకపోవడంతో శుక్రవారం పూర్తి స్థాయి కమిషన్ భేటీ కానుంది. చర్చల అనంతరం తీర్పుపై ఏం చేయాలో నిర్ణయం తీసుకోనున్నారు. మెజార్టీ అభ్యర్థులకు భరోసా కోసం న్యాయపోరాటం కొనసాగించేలా ముందుకు పోవాలని భావిస్తున్నారు.తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సెప్టెంబరు 27న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులు సమర్ధించింది. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినపుడు మరింత జాగ్రత్తలు తీసుకుని తీసుకోవాలి. కానీ అలా తీసుకున్నట్లు కనిపించలేదని హైకోర్టు అభిప్రాయ పడిరది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన అప్పీలును కోర్టు కొట్టి వేసింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం నిర్వహించాలని చెప్పిన సింగిల్ జడ్జి నిర్ణయం సబబేనని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ జె అనిల్‌కుమార్‌ల ధర్మాసనం స్పష్టం చేపింది.
మొత్తం 504 పోస్టుల భర్తీ ప్రక్రియలో 10 నుంచి 15 మంది అనర్హులు చేరినా పరీక్ష నిర్వహణ లక్ష్యం దెబ్బతిన్నట్లేనని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం అడిగిన వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు సమర్పించారు. గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2,85,916 మంది హాజరయ్యారు. వారిలో 2,83,346 మంది అభ్యర్ధులకు బయోమెట్రిక్ నమోదు చేశారు. ఇక ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారని అడ్బొకెట్ తెలిపారు. మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకుని అక్టోబరులో జరిగిన పరీక్షకంటే జూన్‌లో హాజరు సంఖ్య సుమారు 50 వేలు తగ్గింది. దాదాపు 50 వేల మంది అవకాశాలు కోల్పోయారు. ఇదేవిూ చిన్న సంఖ్య కాదని కోర్టు పేర్కొంది. అలాగే జూన్‌లో జరిగిన పరీక్షకు 2,33,248 మంది హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తెల్పింది. కానీ 17 రోజుల తరువాత 2,33,506 మంది హాజరైనట్లు ప్రకటించింది.మధ్యలో 258 మంది అభ్యర్థులు పెరగడం అనుమానాలకు దారితీస్తోంది. నామినల్ రోల్స్ తనిఖీలోనూ సరైన పద్ధతి పాటించలేదు. ఓ విధానమంటూ లేదు. నిబంధనల ప్రకారం ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేయాలి. కానీ కమిషన్ ఒక్కరితోనే సరిపెట్టింది. అవకతవకలు జరిగాయనడానికి అవకాశం ఉన్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. అయితే కమిషన తరపు వాదనలు మరోలా ఉన్నాయి. పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని, కేవలం ముగ్గురు పిటిషనర్లు మాత్రమే ఊహాజనిత అంశాలతో కోర్టును ఆశ్రయించారని, ఇప్పుడు పరీక్షను రద్దు చేస్తే 2 లక్షల మంది నష్టపోతారని తెల్పింది. బయోమెట్రిక్ మినహాయించాలనుకుంటే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి ఉండాలని, అప్పుడు ఎవరూ ప్రశ్నించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది. అందుకు అడ్వెట్ సమాధానమిస్తూ..కమిషన్ రాజ్యాంగ సంస్థ అని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం కమిషన్‌కు ఉంటుందన్నారు. బయోమెట్రిక్ అమలు చేయవద్దని నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగ సంస్థ ముందు ఏం సమాచారం ఉందని ధర్మాసనం నిలదీసింది. అక్టోబరులో నిర్వహించినపుడు బయోమెట్రిక్ పాటించారని, అప్పుడు బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం, పరీక్ష నిర్వహణ అనంతరం అభ్యర్థుల సంఖ్య పెరగడం, నామినల్ రోల్స్‌లో ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేయకపోవడం వంటి అంశాలు అవకతవకలకు అవకాశం ఉందని పేర్కొంటూ పరీక్షను రద్దు చేస్తూ, నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారం తిరిగి నిర్వహించాలని తెల్పుతూ కమిషన్ అప్పీలును కొట్టివేసింది. గ్రూప్`1 రద్దుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని కమిషన్ యోచిస్తోంది
0 కామెంట్‌లు