Ticker

6/recent/ticker-posts

Ad Code

వరద ప్రభావిత జిల్లాల్లోని ప్రజలకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి : Governor తమిలిసై

అన్ని జిల్లాల రెడ్‌ క్రాస్‌ సొసైటీలకు  గవర్నర్‌ తమిలిసై ఆదేశం 

వికారాబాద్‌ సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌,ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తమిలిసై సౌందర రాజన్‌ పాండిచ్చేరి రాజ్‌భవన్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్షాభావ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రములోని అన్ని జిల్లాల రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్రాంచ్‌ లను ఆదేశించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమిళ సై సౌందర రాజన్‌ గారు మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా ఉన్నందున సాదారణ జనజీవనం ఇబ్బంది పడుతున్నారని రెడ్‌ క్రాస్‌ వాలంటీర్లు తక్షణ సహాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని ప్రజలకు సహాయ సామగ్రిని పంపిణీ చేయడం లోను, ఆదుకోవడంలో ఇండియన్‌ రెడ్క్రాస్‌ సొసైటీ యొక్క మంచి పనిని అభినందిస్తున్నాము. అత్యవసరం అయిన ప్రాంతాలలోని ప్రజలకు జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ మరియు యూత్‌ రెడ్‌ క్రాస్‌ వాలంటిర్ల సేవలను ఉపయోగించుకోవాలని, ఇళ్లు కూలిపోయి అత్యవసరం అయినవారికి, జిల్లాలోని అత్యవసర సేవలు అవసరం అయినవారికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగము సహాయ సహకారాలతో మరియు జిల్లా ఆరోగ్యశాఖ సహాయంతో సేవలను అందించాలని సూచించారు.

 ఈ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌  సాయి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర రెడ్‌ క్రాస్‌ సొసైటీ మరియు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి గారి సూచనలు, సలహాలతో జిల్లాలో వర్షాభావ ప్రభావిత ప్రాంతాలలో అత్యవసరమైన వారికి తక్షణ సహాయం చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని వికారాబాద్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ గౌరవ చైర్మన్‌ సాయి చౌదరి తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు