Ticker

6/recent/ticker-posts

Ad Code

నేల చూపుల్లో GOLD..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ); అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఎక్కువ కాలం కొనసాగుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,873 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ? 250 స్వచ్ఛమైన పసిడి ధర ? 270 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ? 1000 పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ? 53,650 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ? 58,530 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో ? 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.విజయవాడలో  10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ? 53,650 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్‌ బంగారం ధర ? 58,530 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ? 77,500 గా ఉంది. విశాఖపట్నం  మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు 

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ? 53,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ? 58,800 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ముంబయిలో  22 క్యారెట్ల బంగారం ధర ? 53,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ? 58,530 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ? 53,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ? 58,680 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

కోల్‌కతా  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ? 53,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ? 58,530 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ? 53,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ? 58,530 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

కేరళలో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ? 53,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ? 58,530 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్లాటినం ధర 

10 గ్రాముల ‘ప్లాటినం’ ధర ? 660 పెరిగి ? 24,370 వద్దకు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల విూద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు