హైదరాబాద్, సెప్టెంబర్ 5 (
ఇయ్యాల తెలంగాణ) : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రం లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖా ఆరంజ్ జోన్ గా ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుంది. దీంతో అనేక జిల్లాలకు హెచ్చరికలు అందాయి. హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అత్యవసర పరిస్థితి ఉంటె తప్ప ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని జి హెచ్ ఎం సి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని సికింద్రాబాద్, సనత్ నగర్, భొలాక్ పుర్, ముషీరాబాద్, అంబర్ పెట్, ముసరం బాగ్, సంతోష్ నగర్ చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, గౌలిపురా, శాలిబండ, ప్రాంతాలలో ని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
0 కామెంట్‌లు