ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టితో తయారుచేసిన విగ్రహాలు ముద్దు
కౌతాళం,సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లోని విద్యార్థులు మట్టి గణేష్ ప్రతిమలను తయారుచేయడం జరిగిందని కరస్పాండెంట్ దండే వెంకట నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దండే వెంకట్ నరేష్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో శ్రద్ధతో మట్టి గణనాధుని ప్రతిమలను తయారు చేసి తీసుకురావడం శుభపరిణామమని, మట్టితో తయారుచేసిన గణనాధుని ప్రతిమలను ప్రతిష్టించడం వలన పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. పాఠశాల వ్యవస్థాపకులు దండే దస్తగిరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులు స్వయంగా మట్టితో తయారుచేసిన గణేష్ ప్రతిమలు తెస్తున్నారని, మట్టితో తయారుచేసిన గణేష్ విగ్రహాలను ప్రతిష్టించాలని విద్యార్థులు సందేశం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు