Ticker

6/recent/ticker-posts

Ad Code

Ganesh నిమజ్జనం.. గత ఏడాదిలానే


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) : నాయక చవితి వేడుకలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. గణేష్‌ నవరాత్రులు జరుపుకునే నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి. వీధిలో మంటపం ఏర్పాటు చేసిన తర్వాత పోటీగా గణేష్‌ విగ్రహాలను ప్రతిష్టించి అంబరాన్నంటేలా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి రోజు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు నగరం నలుమూలల నుంచి విగ్రహాలు తరలివచ్చాయి. వేల విగ్రహాలను ఒకేసారి చూసేందుకు రెండు కళ్లు చాలవు. వినాయక నమజ్జనం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని తెలంగాణ హైకోర్టు గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. 


అదే ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు మరోసారి స్పష్టం చేసింది.హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ జోన్‌ నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ వేసిన ఈ పిటిషన్‌లో గతేడాది పీఓపీతో చేసిన వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తగిన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పిటిషన్‌ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌ పై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు