గణేష్ ఉత్సవాల బందోబస్తు విూద సిబ్బందితో రాచకొండ సీపీ సవిూక్ష సమావేశం
మేడ్చల్, సెప్టెంబర్ 06 (ఇయ్యాల తెలంగాణ) : ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కవిూషనర్ డిఎస్ చౌహాన్, రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసిపిలు, అన్ని పోలిస్టేషన్ ల ఎస్ హెచ్ ఓ లతో ఈరోజు నెరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సవిూక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీపీ సూచించారు. ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
0 కామెంట్‌లు