న్యూఢల్లీ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): జీ`20.. 20 దేశాల సమాఖ్య, సమూహం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక జీ`20 శిఖరాగ్ర సమావేశం. ఈ యేడాది భారత్ వేదికగా ఢల్లీిలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఉ2నీ సమ్మిట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఢల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ యేడు జరుగుతున్న సదస్సులో ప్రధానంగా స్థిరమైన అభివృద్ధి, ఉక్రెయిన్ సంఘర్షణపై కూడా చర్చ జరగొచ్చని భావిస్తున్నారు.ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, స్థిరమైన వృద్ధిని సాధించడానికి సభ్య దేశాల మధ్య విధానపరంగా సమన్వయం.నష్టాలను తగ్గించే మరియు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలను నిరోధించే ఆర్థిక నిబంధనలను ప్రోత్సహించడం.జీ`20 సభ్యదేశాలతో పాటు అధ్యక్ష స్థానంలో ఆతిథ్యమిచ్చే దేశం మరికొన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించవచ్చుఆ క్రమంలో భారతదేశం ఈ సంవత్సరం తన జీ`ఉ20 అధ్యక్ష పదవిలో బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈలను అతిథి దేశాలుగా ఆహ్వానించిందిఅధ్యక్షస్థానంలో ఉన్న దేశం కొన్ని అంతర్జాతీయ సంస్థలను (ఎూలు) కూడా ఆహ్వానించవచ్చు..ఈ ఏడాది ఆహ్వానిత అంతర్జాతీయ సంస్థల్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఎూం), ది కోలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (అఆఖీఎ), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ంఆః)లు ఉన్నాయివీటితోపాటు ప్రతియే జీ`20లో పాల్గొనే అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్య సమితి (ఙఔ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఎఓఈ), ప్రపంచ బ్యాంకు (చిః), ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ), ప్రపంచ వాణిజ్య సంస్థ (చిుూ), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఎఒూ), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఈూః), ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ూఇఅఆ) కూడా పాల్గొంటాయి.అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రాంతీయ సంస్థలను కూడా ఈ ఏడాది భారత్ ఆహ్వానించింది.ఆహ్వానిత ప్రాంతీయ సంస్థల్లో ఆఫ్రికన్ యూనియన్ (ంఙ), ఆఫ్రికన్ యూనియన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ`ఆఫ్రికా అభివృద్ధి కోసం కొత్త భాగస్వామ్యం (ంఙఆం`ఔఇఖంఆ), అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (రూఇంఔ) ఉన్నాయి.జీ`20 ప్రెసిడెన్సీతో వచ్చే ప్రధాన అధికారం సభ్య దేశాలతో ఆతిథ్య దేశాలను, అంతర్జాతీయ సంస్థలను, ప్రాంతీయ సంస్థలను ఎంపిక చేసుకుని ఆహ్వానించగల్గడం.ఈ ఆహ్వానాలు అధ్యక్ష స్థానంలోని దేశం ఎజెండాను ప్రస్ఫుటం చేస్తాయి. అలాగే జీ`20 సదస్సుకు మార్గనిర్దేశం చేస్తాయి.ఉదాహరణకు, ఈ ఏడాది ఆఫ్రికన్ దేశాలు, ఆ ఖండంలోని ప్రాంతీయ సంస్థలకు భారతదేశం ఆహ్వానాలు పంపింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆఫ్రికా ఔట్రీచ్ వ్యూహంలో ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఖండంలో పెరుగుతున్న చైనా ఉనికిని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. అలాగే ఆఫ్రికన్ యూనియన్‌ను జీ``20లో శాశ్వత సభ్యులుగా చేయాలని భారత్ కూడా పిలుపునిచ్చింది.
0 కామెంట్‌లు