హైదరాబాద్, సెప్టెంబర్ 23, (ఇయ్యాల తెలంగాణ ); ఢల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం పూర్తి అయింది. రెండు రోజుల పాటు కాగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సాగిస్తుండగా.. ఈరోజే దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో సర్వే రిపోర్టు, సామాజిక వర్గం, బలమైన అభ్యర్థి అంశాలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. ఏకాభిప్రాయంతో 60 శాతానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వార్ రూములో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది.స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిక్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క హాజరు అయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఆ నివేదికను ఢల్లీి సమావేశానికి తీసుకువచ్చింది. 119 నియోజవర్గాలకు దాదాపు 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో గతంలోలా పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందర్నీ లైన్లో పెడుతున్నారు. ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు తాజాగా? స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.. ఇటీవల వారిద్దరూ? అసంతృప్తిగా ఉంటున్నారు. వెంటనే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు. మరో వైపు బుస్సు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్రలో సీనియర్లు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. స్థిరమైన పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకం కలిగేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలు తగ్గిపోయాయి. పెద్దగా పార్టీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.రేవంత్ రెడ్డి పూర్తిగా డామినేట్ చేస్తున్నారన్న విమర్శలు, అలకలు ఉన్నప్పటికీ? .ఆయనకు పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని? హైకమాండ్ ఆలోచనతోనే అన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా గట్టిగా పంపడంతో.. కాంగ్రెస్ లో పరిస్థితి లైన్ లోకి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగేందుకు మధుయాష్కి గౌడ్ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది.ఇక్కడి నుండి పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డిలు సంవత్సరాలుగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేపడుగూ నిత్యం ప్రజల మద్య ఉంటూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ తాను స్థానికుడినే అంటూ ఎల్బీ నగర్ నుండి పోటీ చేసేందుకు ముందుకు రావడంతో సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులలో ఆందోళన మొదలైంది.
ఢల్లీ బాట పట్టిన ఆశావహులు; అనేక మంది నేతలు సొంత జిల్లాల నుంచి ఢల్లీికి వెళ్లి వారిని కలుస్తున్నారు. అంతే కాకుండా ఆ నాయకుల ప్రధాన అనుచరులు, వారినే నమ్ముకున్న నేతలు కూడా హస్తినకు వెళ్లారు. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఎక్కువ మంది హస్త్తినకు చేరుకున్నారు. దాదాపు 35 నుంచి 40 సీట్లకు ఒకే పేరు పంపించినట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి కొన్ని చోట్ల రెండు పేర్లు, మరికొన్ని చోట్ల మూడుపేర్లు పంపించినట్టు పార్టీ నేతలు అంటున్నారు. ఒక్కటే పేరు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్య లేకపోయినా, రెండు, మూడు పేర్లు ఉన్న చోట ఏ ఒక్కరికి ఇచ్చినా మరొకరి నుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ భావిస్తున్నది.జాబితా దఫాదఫాలుగా ప్రకటించకుండా మొత్తం సీట్లను రెండు జాబితాలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లి?ఠాక్రే ఎవరు చెప్పితే వింటారో కూడా విచారిస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అంతకు ముందు రాష్ట్ర ఇంచార్జిలుగా వ్యవహరించిన ద్విగిజరుసింగ్, రామచంద్రకుంతియా, మాణిక్యం ఠాగూర్‌లను కొంత మంది నేతలు ప్రసన్నం చేసుకుంటున్నట్టు తెలిసింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ సొంత రాష్ట్రమైన కేరళ కూడా వెళ్లి పైరవీలు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ మాత్రం సమర్థత, ప్రజల్లో పలుకుబడి, వారు చేస్తున్న కార్యక్రమాలు బేరిజు వేసి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి కొన్ని చోట్ల ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. వారు పార్టీకి అన్ని సహయ,సహకారాలను అందించేటట్టు ఆదేశించింది. కొంత మందికి పార్టీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ఇస్తామని ఒప్పిస్తున్నది. ఈసారి ఫైరవీలకు తావులేదంటూ అధిష్టానం చెబుతున్నా?నాయకులు వారి మాటలను పెడచెవిన పెట్టి ఢల్లీికి వెళ్లారని అంటున్నారు. పైరవీలకు టిక్కెట్లు రాలవని ఖచ్చితంగా గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోంది.
0 కామెంట్‌లు