Ticker

6/recent/ticker-posts

Ad Code

తెలుగులో English మందులు.. సామాన్యులకు అర్థమయ్యేలా తొలి ప్రయోగం


హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) : సామాన్యులకు అర్థమయ్యేలా తొలి ప్రయోగం.  337 మందులకు తెలుగు భాషలో పేర్లు.  తెలుగు భాష పునర్జీవనానికి సర్కారు యత్నం.  ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.      ఇప్పటిదాకా మందులు అంటేనే అంతా ఇంగ్లీష్‌ మయం.  ప్రభుత్వ దావఖానల్లోనే కాదు. ప్రైవేటుగా మందులు అంటేనే అంతా ఇంగ్లీష్‌ మయం.  ప్రభుత్వ దావఖానల్లోనే కాదు,  ప్రైవేటుగా కూడా ఏ మందు పేరు తెలుగులో ఉండదు.  వైద్య పరంగా మాట్లాడేందుకు కూడా తెలుగు భాషను వినియోగించడం చాలా అరుదుగా కనిపిస్తుంది.  ఇలాంటి తరుణంలో రోగులకు,  సామాన్య ప్రజానీకానికి సులభంగా అర్థమయ్యే రీతిలో మందుల పేర్లు ఇంగ్లీషుతో పాటు,  తెలుగులోనూ ముద్రించి పంపిణీ చేస్తున్నారు.  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అడుగు ముందుకు వేసి ఆ శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రోగులకు ఇచ్చే మందుల పేర్లను తెలుగు ముద్రించడం మొదలుపెట్టారు.  ఈ శాఖ మొత్తం 337 మందులను సరఫరా చేస్తుండగా ఇప్పటికీ చాలా వాటిపై తెలుగులో పేర్లు వస్తున్నాయి.    సగానికి పైగా మందులకు తెలుగులో పేర్లు అమాక్సిలిన్‌,  సిప్రో ఫ్లాక్సిన్‌ అనే యాంటీబయోటిక్‌ మందులు, అట్టెన్లాల్‌,  అమ్లోడిపిన్‌ బీపీని తగ్గించే మాత్రలు,  పాంటాప్రజోర్‌,  రామ్‌ టిడిన్‌ అనే గ్యాస్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే మందులు మెటాఫార్మింగ్‌ అనే షుగర్‌ నియంత్రించే మందులతో , క్లోరోజూలైడిరగ్‌, నిడజోల్‌,  మెట్రో అల్యూమినియం హైడ్రాక్సైడ్‌,  సాలబుట్టమాల్‌ అనే పలు వ్యాధులకు వాడే ఎన్నో మందుల పేర్లు నేడు తెలుగులో ప్రచురితమవుతున్నాయి.  ప్రభుత్వ దావఖానాలకు ఎక్కువగా గ్రావిూణులు,  నిరక్షరాశులు పేదలే వస్తుంటారు.  


మందుల పేర్లు తెలుగులో ముద్రించడం వలన అంతంత మాత్రం చదువుకున్న వారికి కూడా అర్థమవుతుందని , ఏ ఏ సమయాలలో మందులు వేసుకోవాలో అవగాహన కలుగుతుందని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లిల్లీ మేరి అన్నారు. అది గాక ప్రభుత్వం సరఫరా చేసే ఈ మందులపై తెలుగులో పేర్లు ఉండటం వలన బయట మార్కెట్లో వాటిని విక్రయించే వీలు కాదని డాక్టర్‌ లిల్లీ మేరి స్పష్టం చేస్తున్నారు. దావఖానకు వెళ్లి ఫార్మసిస్ట్‌ ఇచ్చే మందులు అంతకుముందు ఆంగ్లంలో ఉండటంతో వారికి ఏ ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలి తెలిసేది కాదు.  దీంతో వారికి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత ఫార్మసిస్ట్లపై ఉండేది.  ప్రస్తుతం తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో సులువుగా గుర్తుపట్టి సమయానికి మందులు వేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వము ఆంగ్లము తెలుగులో అందులో పేర్లు ముద్రించటంతో పాటు మందుల పేర్లు తెలుగులో నాట్‌ ఫర్‌ సేల్‌ గవర్నమెంట్‌ సప్లై అనే అక్షరాలు రాసి ఉండటంతో మందులు పక్కదారి పట్టి అవకాశం లేదని డాక్టర్‌ లిల్లీ మేరి స్పష్టం చేస్తున్నారు. 

 కెసిఆర్‌, హరీష్‌ రావు నిర్ణయం ప్రశంసనీయం ` డాక్టర్‌ లిల్లీ మేరి

మాతృభాషలో మృత భాషలవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరియు మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు గార్ల తెలుగు భాషాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.  ప్రభుత్వంలో కీలక శాఖ అయినా వైద్య ఆరోగ్య శాఖలో తెలుగులో మందుల పేర్లు ముద్రించడం అందరికీ ప్రయోజనమే.  అలాగే డాక్టర్లు కూడా తెలుగులోనే మందులు చీటీలు రాసే సమయం రావాలి.  దేశభాషలందు తెలుగు లెస్స అనే నానుడి నిజం కావాలని ఆశిస్తున్నా అని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లిల్లీ మేరి అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు