Ticker

6/recent/ticker-posts

Ad Code

CONTRACT JUNIOR LECTURES కు న్యాయం చేయాలి CM KCRకు రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌ సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ):కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్లకు ఐదారు నెలలుగా పెండిరగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి. కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్లకు ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. వివిధ కారణాలతో రెగ్యులరైజ్‌ చేయని వారిని  తక్షణమే రెగ్యులర్‌ చేయాలటీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేసారు. ఈ మేరకు అయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఒక బహిరంగ లేఖ రాసారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ  కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, జూనియర్‌ లెక్చరర్లు  కీలక భూమిక పోషించారు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగాలు ఉండవు..  అంతా సర్కార్‌  ఉద్యోగులే ఉంటరు.. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిన్రు.. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్‌ చేస్తా అని తెలంగాణ ఉద్యమ సమయంలో విూరు చాలా సార్లు హావిూ ఇచ్చారు. అంతేకాకుండా 2014 టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారని అన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా.. సకాలంలో నెలలుగా జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి, ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ కు వేతనాలు చెల్లించలేని దుస్థితి విూ ప్రభుత్వంలో దాపురించింది. మరి దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్లో బోధించే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఏ మాత్రం క్షమార్హం కాదు.  ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్‌  లెక్చరర్ల కు సకాలంలో జీతాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత విూపైన ఉంది. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని లేఖలో పేర్కోన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు