రాజమండ్రి సెప్టెంబర్ 23 (ఇయ్యల తెలంగాణ): స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. . సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలోని 12 మందితో కూడిన బృందం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారించింది. . చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ కొనసాగింది. . సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. . ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం ఇచ్చారు. . చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. కస్టడీకి తీసుకునేముందు, తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణను వీడియోగ్రాఫర్‌తో రికార్డు చేయించాలని స్పష్టం చేసింది. ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు.
0 కామెంట్‌లు