Ticker

6/recent/ticker-posts

Ad Code

స్వరం మార్చిన CANADA

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 25, (ఇయ్యాల తెలంగాణ ); ఖలిస్తాన్‌ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (45) హతమార్చడంలో భారత్‌ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేసిన సంగతి తెలిసిందే. నిజ్జర్‌ను భారత్‌ 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. కెనడాతో భారత్‌ సంబంధాలు ట్రూడో ఆరోపణ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదం ముదురుతోంది. కెనడా ఆరోపణల నేపథ్యంలో భారత్‌ వీసా నిషేధాన్ని విధించింది. భారత్‌లోని కెనడా రాయబారిని ఒకరిని ఆ దేశానికి తిరిగిపంపించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కెనడా రక్షణ మంత్రి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు చాలా ముఖ్యమైనవి అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.గ్లోబల్‌ న్యూస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌తో సంబంధాలు సవాలుగా మారాయని మేము అర్థం చేసుకున్నాం. అయితే అదే సమయంలో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని బయటకు తీసుకురావడం మా బాధ్యత. ఆరోపణలు నిజమైతే, కెనడాకు ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుంది’ అని ఆయన అన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తమకు ఎంతో ముఖ్యమైనవిగా ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో చట్టాన్ని రక్షించడం మా బాధ్యత. విచారణ చేసి అసలు నిజాన్ని బయటకు తీసుకువస్తామంటూ ఆయన అన్నారు.ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యతో భారత్‌, కెనడా మధ్య సంబంధాలు గత వారం రోజుల నుంచి దారుణంగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. అయితే కెనడా ఆరోపణలు నిరాధారమైనవనిగా భారత్‌ కొట్టిపారేసింది. మిలిటెంట్లు, భారత వ్యతిరేక సంస్థలపై ఆపరేషన్లు నిర్వహించాలని కెనడాను భారత ప్రభుత్వం గురువారం ఆదేశించింది. కెనడియన్ల కోసం ప్రస్తుతానికి వీసా సేవలు నిలిపివేస్తున్నట్లు తెల్పింది. అలాగే దేశంలోని తన దౌత్య సిబ్బందిని తగ్గించాలని కెనడాను భారత్‌ కోరింది. కాగా.. కెనడాలోఉన్న భారత సిబ్బంది కంటే భారతదేశంలో కెనడియన్‌ దౌత్య సిబ్బంది సంఖ్య పెద్దది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు