Ticker

6/recent/ticker-posts

Ad Code

భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); సిద్ధిపేటలో భరోసా కేంద్రాన్ని  మంత్రి హరీష్‌ రావు, డీజీపీ అంజనీ కుమార్‌ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సిద్దిపేట సీపీ శ్వేత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ భరోసా భవనాన్ని మహిళ సంరక్షణ సముదాయంగా వాడుకుందాం. బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలను పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ తుచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ 2014 తరువాత రాష్ట్ర ప్రభుత్వం కమిట్‌ మెంట్‌ తో పనిచేస్తుంది. ఈ భరోసా, సఖి లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. ఈ సెంటర్‌ లు మహిళలలకు, చిన్న పిల్లలకి  ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు