హైదరాబాద్, సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ని పురస్కరించుకుని పర్యావరణ హితం కోసం జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బందికి
గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు: ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ... తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నగర వాసులు పర్యావరణాన్ని కాపాడే విధంగా పండుగను జరుపుకోవాలని కోరారు. నగర వ్యాప్తంగా జిహెచ్‌ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 4.64 లక్షల మట్టి విగ్రహాలను ఈ నెల 16,17 తేదీల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో అన్ని వార్డు ఆఫీసు ఆవరణలో ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడిరచారు.
0 కామెంట్‌లు