హైదరాబాద్, సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ శుభవార్త. రెగ్యులరైజ్ చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేసి నాలుగో తరగతి కార్యదర్శులుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త, పాత వేతనాలు ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. దీనిపై పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా స్పందించారు. ఆయా జేపీఎస్ ల వేతనాలకు సంబంధించిన బిల్లులను వెంటనే సిద్ధం చేసి మండల ఉప ఖజానా కార్యాలయాలకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. బిల్లుల ఆధారంగా ఎస్టీవీల ద్వారా వేతనాలు చెల్లించాలని జిల్లా ట్రెజరీ అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నాలుగో తరగతి కార్యదర్శులుగా కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు అందుతాయి.రాష్ట్రంలో 2019 ఏప్రిల్‌లో జేపీఎస్ నియామకం జరిగిందని.. అప్పట్లో మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేస్తారనే షరతుతో ఉద్యోగాలు ఇచ్చారు. నెలకు రూ.15 వేల వేతనంతో మూడేళ్లపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కానీ మూడేళ్లు దాటినా రెగ్యులరైజ్ కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల రోడ్డున పడ్డారు. విధులను బహిష్కరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో చర్చించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యంలో మూడిరట రెండొంతులు సాధించిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిని గ్రేడ్`4 కార్యదర్శులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేశారు. దీని ప్రకారం వారికి నెలకు రూ.32 వేలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
పంచాయితీ కార్యదర్శులకు కొత్త జీతాలు
బుధవారం, సెప్టెంబర్ 13, 2023
0
Tags