హైదరాబాద్, సెప్టెంబర్ 12, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలూ అధికారం కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అందులో బీజేపీ అయితే.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగరెయ్యాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టుగానే కసరత్తు మొదలుపెట్టింది. ఢల్లీి నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. ఏకంగా 6 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయంటే.. బీజేపీకి క్రేజ్ మామూలుగా పెరిగిపోలేదు మరి. అయితే.. ఈ దరఖాస్తులు
చేసుకున్నవాళ్లలో కీలక వ్యక్తులు అందులోనూ వీర మహిళలు ఉండటం.. వాళ్లు ఏ చోట నుంచి బరిలో దిగుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.ఈటల రాజేందర్ భార్య జమున, బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి లాంటి రాజకీయ నేతల కుటుంబ సభ్యులతో పాటు సినిమా గ్లామర్ ఉన్న జీవితా రాజశేఖర్ కూడా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే.. అందులో జీవితా రాజశేఖర్ అప్లికేషన్ మాత్రం ప్రత్యేక చర్చకు తెరలేపింది. ఎందుకంటే.. అందరిలా జీవితా రాజశేఖర్ కూడా ఒక్క దరఖాస్తుతో సరిపెట్టాలేదంట మరి. ఏకంగా నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోందిముఖ్యంగా.. హైదరాబాద్ నగరం నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోన్న జీవితా రాజశేఖర్.. నాయకత్వానికి 4 స్థానాలను ఆప్షన్‌గా ఇచ్చారట. నగరంలోని జూబ్లీ హిల్స్, సనత్ నగర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఓ చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారంట. ఇప్పటికే.. నగరంలో బీజేపీ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో.. తాను అనుకున్న స్థానం నుంచి నాయకత్వం అవకాశం కల్పించకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందన్న ముందుచూపుతో.. తాను పోటీ చేయాలనుకుంటున్న నాలుగు స్థానాల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.మొత్తానికి ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో నిలవాలని గట్టిగా ఫిక్స్ అయిన జీవితా రాజశేఖర్.. ఈ నాలుగింటిలో.. ఏదో ఓ స్థానం నుంచి టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని అంతే గట్టిగా కోరుతున్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా జరుగతున్నాయని తెలుస్తోంది. మరి.. అధిష్ఠానం ఈ నాలుగింటిలో ఎక్కడ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తుందో.. అసలు పోటీకి ఛాన్స్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో సాకేంతికంగా కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా.. సర్వేలు చెప్తున్న దాని ప్రకారం ఆ సంఖ్య రెండంకెలకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. కొంచెం జాగ్రత్త పడితే మంచి ఫలితాలు రాబట్టొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే.. అభ్యర్థుల ఎంపిక విషయంలో అంతే జాగ్రత్తగా వ్యవహరించాలని నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం.కమలం బరిలో జీవిత, జమున, విజయలక్ష్మీ, జయసుధ
మంగళవారం, సెప్టెంబర్ 12, 2023
0
Tags