Ticker

6/recent/ticker-posts

Ad Code

బావిలో ముగ్గురు కుటుంబసభ్యులు మృతి


విజయనగరం సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ );  విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బావిలో పడి మృతి చెందారు. వారు బావిలో ఎప్పుడు దూకారనేది తెలియకపోయి నప్ప టికీ... మృతదేహాలు బయటకు తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దంపతుల మృతదేహాలు నీటిలో పైకి తేలాయి. అయితే స్థానిక ప్రజలు విషయం గుర్తించి పోలీసులకు తెలపగా.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే 46 ఏళ్ల మహముద్దీన్‌, అతడి భార్య 39 ఏళ్ల షరీష నిషా మృతదేహాలు బావిలో తేలగా.. బయటకు తీశారు. లోపల మరో మృతదేహం ఉన్నప్పటికీ.. దాన్ని బయటకు తీయలేరు. అయితే ఆమె వీరి కూతురు 18 ఏళ్ల ఫాతిమా జహారగా పోలీసులు గుర్తించారు. అయితే చింతలపాలెం గ్రామ పొలాల వద్దకు క్యాబ్‌ లో వచ్చిన ఈ ముగ్గురు మృతులు..ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ 19 ఏళ్ల కుమారుడు అలీకి తెలిపారు. ఫోన్‌ చేసి విషయం చెప్పి లొకేషన్‌ కూడా పెట్టి మరీ బావిలో దూకినట్లు తెలుస్తోంది. అలాగే కొత్త వలస సీఐ చంద్రశేఖర్‌ వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు