చెన్నై సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ );దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
చెన్నైలోని తారామణిలో భారత హరితవిప్లవ పితామహుడు, సుప్రసిద్ద వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలలో మంత్రి పాల్గొన్నారు. అయనవెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీడ్సీ ఎండీ కేశవులు ఇతరులు వున్నారు.మంత్రి మాట్లాడుతూ భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుంది. డాక్టర్ స్వామినాథన్ లాంటి వారు యుగానికొక్కరు పుడతారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త మరణం బాధాకరమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి లక్షలాదిమంది చనిపోయిన పరిస్థితిని చూసి చలించి వైద్య విద్యను వదిలేసి వ్యవసాయ విద్యను ఎంచుకుని పరిశోధకుడిగా మారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. పరిశోధకుడిగా తిండిగింజలను అందించి ఆకలిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న శాస్త్రీయ యోధుడు. మానవాళి జీవిస్తున్న ఈ వందేళ్లకాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలోని అద్భుతమయిన శాస్త్రవేత్త. ఆయన సారధ్యంలో ఏర్పడిన కవిూషన్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించింది. కవిూషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు చేస్తానన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా రైతాంగానికి అన్యాయం చేసింది. మొదటి ఫుడ్ ప్రైజ్ విజేతగా భారతదేశ ఖ్యాతిని పెంచారు. రెండు నెలల క్రితమే వారిని వ్యక్తిగతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి వస్తాను .. వార్తలు చూస్తున్నాను .. ఆరోగ్యం కుదుటపడితే వస్తాను అని చెప్పారు. వారు తెలంగాణకు వస్తానన్న ఆసక్తి మాలో స్ఫూర్థిని నింపింది. వారి దార్శనికత ఎంతో గొప్పది ..వారు కేవలం పరిశోధకుడే కాదు ఆయన భావి తరాల అవసరాలను గుర్తెరిగి చిత్తశుద్దితో ప్రజలే కేంద్రబిందువుగా పనిచేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన వారికి శిరస్సు వచ్చి శ్రద్దాంజలి ఘటించాం. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకపోవడం దురదృష్టకరమని అయన అన్నారు.
0 కామెంట్‌లు