Ticker

6/recent/ticker-posts

Ad Code

నంద్యాలలో ఉద్రిక్తత భూమా అఖిల ప్రియ అరెస్ట్‌

నంద్యాలసెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ ):ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం  తెల్లవారుజామున అఖిల ప్రియ, తమ్ముడు విఖ్యాత్‌, భర్త భార్గవ్రామ్ని అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు. ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు. ఇంట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దీక్షను ఆపేది లేదని అఖిలప్రియ అన్నారు. నా తమ్ముడికి ఏదైనా జరిగితే అందుకు నంద్యాల ఎస్పీ, డీఎస్పీలే బాధ్యత వహించాలని సంచలన వాఖ్యలు చేశారు అఖిల ప్రియ.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు