పెద్దపల్లి సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): ఉద్యోగ భద్రత కల్పించని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద చేస్తున్న సమ్మె బీఎస్పి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 6 రోజుల నుండి కాంట్రాక్టు ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కి దోపిడి పాలన చేస్తున్నారని విమర్శించారు. స్టాఫ్ నర్సులు, ఫార్మసీస్, సెకండ్ ఏఎన్ ఎం లకు ఉద్యోగ భద్రత లేక కరోనా సమయంలో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్న వీరికి కనీస ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, హెల్త్ కార్డులు కూడా లేవని ప్రజల ఆరోగ్యం చూసుకునే వారికి కనీస ఆరోగ్య భద్రత ఇవ్వని ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేయాలన్నారు. గత 23 సంవత్సరాల నుండి పబ్లిక్ హెల్త్ మేనేజర్ గా పనిచేస్తున్న వారికి రూ.13 వేల వేతనంతో చాలీచాలని జీవితాలను కొనసాగిస్తున్నారని వీటన్నింటికి చరమగీతం బహుజన రాజ్యం తెచ్చుకో వాళ్లన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామిల్ల శారద, పట్టణ ఉపాధ్యక్షులు మాచర్ల బబ్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, బివిఎఫ్ టీం చిన్ను, హనీ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు