Ticker

6/recent/ticker-posts

Ad Code

యాదవుల జోలికి వస్తే సహించేది లేదు


పెద్దపల్లి సెప్టెంబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ); తమ పై కవ్వింపు చర్యలకు ఎవరూ పాల్పడినా సహించేది లేదని అఖిలభారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షడు మేకల మల్లేశం యాదవ్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సందనవేన రాజేందర్‌ యాదవ్‌ హెచ్చరించారు. పెద్దపల్లి ప్రెస్‌ క్లబ్‌ లో బుధవారం ఉపాధ్యక్షుడు దారబోయిన నరసింహ యాదవ్‌, గొర్ల కాపరుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు తమ్మడబో యిన ఓదెలు యాదవ్‌ లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు చెందిన యాదవ సంఘం నాయకుడు వట్టే జానయ్య యాదవ్‌ పై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. జానయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటాడని భావించిన కొందరు నాయకులు  కుట్రపన్నారని ఆరోపించారు. యాదవుల ఎదుగుదలను ఓర్వలేని వారికి వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జానయ్యపై కుట్రలు మానుకో కపోతే రాష్ట్ర వ్యాప్తంగా యాదవుల మంతా ఏకమై సూర్యాపేట జిల్లా ముట్టడిస్తామని తెలిపారు. యాదవులకు ఏపార్టీ నుండి టికెట్‌ వచ్చినా వారీ గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. యాదవు లు ఐక్యంగా కలసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. యాదవులకు రాజకీయపార్టీలు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు ఆవుల మల్లయ్య, పర్సవేన సమ్మయ్య, సలెంద్ర రాములు, మంద మల్లయ్య, కొమ్మ సతీష్‌, నక్క రాజ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు