Ticker

6/recent/ticker-posts

Ad Code

అప్రమత్తంగా వుండాలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌ సెప్టెంబర్ 5 (ఇయ్యాల తెలంగాణ ): సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల  నేపథ్యంలో జీహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాటర్‌ వర్క్స్‌ ఎండి  దాన కిషోర్‌, ట్రాన్స్‌ కో ఎండి,  జి?లా కలెక్టర్‌ తో మంత్రి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలి. హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ వాటర్‌ లెవెల్స్‌ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలి. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసి  కంట్రోల్‌ రూమ్‌ 21111111, 23225397 ను సంప్రదించాలని సూచించారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు