Ticker

6/recent/ticker-posts

Ad Code

మెదక్‌ భారమంత రఘునందుడి పైనే

 

మెదక్‌, సెప్టెంబర్‌ 12, (ఇయ్యాల తెలంగాణ );  మెదక్‌ జిల్లాలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క దుబ్బాక తప్ప మిగత నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలే లేరని తెలుస్తోంది.సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప, పాత మెదక్‌ జిల్లాలోని మిగత 9 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు లేని పరిస్థితి. ఇన్నేళ్లుగా ఏ నియోజకవర్గంలోనూ బలమైన క్యాడర్‌ ను నిర్మించుకోలేకపోవడమే దీనంతటికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాడర్‌, లీడర్‌ లేని మెదక్‌ జిల్లా బీజేపీ మోదీ చరిష్మా, సోషల్‌ విూడియా, ప్రభుత్వ వ్యతిరేకత విూదే పూర్తిగా ఆధారపడిరది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాజేశ్వరావు దేశ్‌ పాండే , శివరాజ్‌ పాటిల్‌ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇద్దరిలో ఎవ్వరు కూడా గట్టి పోటీనిచ్చే పరిస్థితిలో లేరని విశ్లేషకులు అంటున్నారు. పాండేకు, పాటిల్‌ కు సొంత క్యాడర్‌ లేదనేది అభిప్రాయం.పటాన్‌ చెరు నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌, సి.అంజి రెడ్డి, శ్రీకాంత్‌ గౌడ్‌, ఎడ్ల రమేష్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహిపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ మధ్యలో మాత్రమే ఉంటుందని పటాన్‌ చెరు నాయకుల అభిప్రాయం. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసిన 2018 ఎన్నికలలో పార్టీకి వచ్చిన మూడోస్థానం మెరుగుపర్చడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోల్‌ నుంచి మూడుమార్లు గెలిచి ఎమ్మెల్యే అయినా నటుడు పి.బాబు మోహన్‌ 2018లో బీజేపీలో చేరి పోటీ చేస్తే నిండ మూడు వేల ఓట్లు కూడా పొందలేదు. దీంతో ఈ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. నారాయణఖేడ్‌ నియోజవర్గం నుంచి బీజేపీ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ సంగప్ప పోటీ పడుతున్నారు. సంగప్ప తరుచుగా నియోజకవర్గంలో తిరుగుతుండగా, విజయపాల్‌ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఎవరు పోటీ చేసినా పార్టీకి ఇక్కడ విజయావకాశాలు పెద్దగా లేవని సమాచారం.జహీరాబాద్‌ నియోజవర్గంలోసీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దామోదర రాజనరసింహ సొంత తమ్ముడు రాంచందర్‌ బీజేపీలో జాయిన్‌ అయ్యారు. పార్టీ కూడా టికెట్‌ అతనికే ఇచ్చే అవకాశం ఉంది. 2018లో బీజేపీ టికెట్‌ పైన పోటీ చేసి సుమారుగా 20,000 ఓట్లు తెచ్చుకున్న జంగం గోపిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం బీజేపీ పెద్ద నష్టంగా మారింది. సిద్దిపేట నియోజకవర్గంలో దూది శ్రీకాంత్‌ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్‌ నరోత్తం రెడ్డి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్నారు, కానీ రాష్ట్రంలోనే అత్యున్నత మెజారిటీతో గెలిసిన మంత్రి హరీశ్‌ రావుకు వీరు ఏ మాత్రం పోటీ ఇవ్వగలరనేది పెద్ద ప్రశ్న. సీఎం పోటీ చేస్తున్నగజ్వేల్‌ నియోజకవర్గంలో బీజేపీ టికెట్‌ ని ఆశించే వాళ్లు కూడా పెద్దగా లేరంటే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోంది.ఇక దుబ్బాక నియోజకవర్గంలో గెలిసిన రఘునందన్‌ రావు పైనే బీజేపీ మొత్తం ఆశలు పెట్టుకుంది. కానీ ఈసారి మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత కొత్త ప్రభాకర్‌ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపడంతో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిన మురాలి యాదవ్‌, బీజేపీ సింగాయపల్లి గోపి టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీకి ఇక్కడ క్యాడర్‌ లేకపోవటం, ఈ ఇద్దరు లీడర్ల మధ్య కూడా సఖ్యత లేకపోవటం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈసారి ఈటల రాజేందర్‌ సతీమణి జామున పోటీ చేసే అవకాశం కూడా ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. అలా జరిగితే, జమున తప్పకుండా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మెదక్‌ పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌ గడ్డం శ్రీనివాస్‌ టికెట్‌ ను ఆశిస్తున్నారు. ఎన్నికల్లో అతని ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు