రంగారెడ్డి సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); మహేశ్వరంలో విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి కాన్వాయ్ ను అంగన్వాడీ టీచర్లు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు మహిళలపై విరుచుకుపడ్డారు.పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలో మంత్రి కాన్వాయ్ రోప్ పార్టీ పోలీసులను తరిమారు. మహిళా పోలీసులు లేకుండా అంగన్వాడీల టీచర్లపై పోలీసులు చేతులు వేసారని ఆరోపించారు. మహేశ్వరం పట్టణంలో రోడ్డుపై బైఠాయించారు.` గత కొద్ది రోజులుగా సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ` మంత్రి సబితా ఇంద్రారెడ్డి కనీసం స్పందించకపోవటంపై సిగ్గుచేటని వారు విమర్శించారు.
0 కామెంట్‌లు