విశాఖపట్నం, సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ): విశాఖ జిల్లా 56వ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సాంకేతిక విద్యార్థినీ విద్యార్థులకు బంగారు, రజత పతకాలు వరించాయి. విశాఖలోని వెలంపేట విజయాంధ్ర జిమ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో మోహన్ రాకేష్ బంగారు పతకం దక్కించుకున్నారు. అలాగే శ్యామల, శ్యామ్‌లు రజత పతకాలు దక్కాయి. ఈ సందర్భంగా జిమ్ కాలేజీ కోచ్ శివకుమార్ మాట్లాడుతూ శారీరకంగా దృఢంగా ఉంటేనే విద్యలోనే రాణించగలుగుతారన్నారు. అవార్డులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం సహకారంతోనే ఈ ఫలితాలను రాబట్టిగలిగామన్నారు.
0 కామెంట్‌లు