హనోయ్ సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ): : మానవ హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛాయుత విూడియా సహా పలు అంశాలపై జీ20 వేదికగా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడిరచారు. ఢల్లీిలో జీ20 (ఉ20) సదస్సులో పాల్గొన్న అనంతరం వియత్నాంలో పర్యటిస్తున్న బైడెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ హక్కులను గౌరవించడం, పౌర సమాజం పోషించాల్సిన పాత్ర, విూడియా స్వేచ్ఛ వంటి పలు అంశాలపై మోదీతో తాను విస్తృతంగా చర్చించానని చెప్పారు.భారత్`అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలపై తాము సంప్రదింపులు జరిపామని అన్నారు. రక్షణ భాగస్వామ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్టపరిచేందుకు కట్టుబడి ఉండాలని ఇరు నేతల సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ ఏడాది జూన్లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై తాము చర్చించామని బైడెన్ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడంలో తమ చొరవ, నాయకత్వ పటిమను చాటేందుకు అమెరికాకు ఇది అందివచ్చిన అవకాశమని అన్నారు. సమ్మిళిత వృద్ధి, నిలకడతో కూడిన అభివృద్ధికి పెట్టుబడులు వెచ్చించడం సహా వాతావరణ మార్పులు, సవాళ్లు, ఆహార భద్రత బలోపేతం, విద్యా, వైద్య రంగాల్లో వినూత్న మార్పులు వంటివి కీలక అంశాలుగా ముందుకొచ్చాయని బైడెన్ పేర్కొన్నారు.
ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోదీతో చర్చించా : జోబైడెన్
సోమవారం, సెప్టెంబర్ 11, 2023
0
Tags