Ticker

6/recent/ticker-posts

Ad Code

శవానికైనా ... తప్పని అగచాట్లు..మృతదేహం ఖననం చేయాలంటే... నది దాటాల్సిందే

విశాఖపట్నం సెప్టెబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ); బీమిలి మండలం తాటితూరు సచివాలయ పరిధి  వేము ల పెద్ద రమణ అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో చికి త్స పొందుతూ మృతి చెందాడు.తాటితూరు బీసీ కళ్లాలకు చేరాలంటే మధ్యలో గోస్తనీ నది ద్వారా బాట ఉండేది.ప్రస్తుతం నదిలో నీరు ఎక్కు వగా ఉండటంతో నదిలో నుండే మృతదేహాన్ని కట్టెపై బంధువులు అవ తల ఒడ్డుకు చేర్చారు.పీకల్లోతు నీటినుండే మృతదే హాన్ని తీసుకు వెళ్లడం పలువురికి కంటతడి పెట్టిం చింది.గ్రామస్తులంతా ఇటువంటి దుస్థితి మరెవరికి రాకూడదు అంటూ రోదించారు.రెండు కోట్ల వ్యయంతో కాజ్వే నిర్మాణానికి ప్రస్తుత  ఎమ్మెల్యే,అవంతి శ్రీనివాస రావు 2022 మార్చి 2న శిలాఫలకం వేసారు. నాటి నుండి నేటి వరకు ఆ ప్రసక్తే లేదని స్థానికులు మండి పడుతున్నారు.పదవీకాలం ముగుస్తున్నా నేటి వరకు నిర్మాణ పనులు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాజ్వే నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు