న్యూ డిల్లీ సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ); గూగుల్ పే, ఫోన్ పేటీఎం తదితర వినియోగదారులు ఏం చేయాలి?
Ñయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతున్న సంఘటనల్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఒకరికి బదులుగా మరొకరికి నగదును బదిలీ చేయడం, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్స్ తప్పుగా టైప్ డబ్బు పంపడం, ఇతరత్రా అనధికారిక పేమెంట్స్ ద్వారా నష్టపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు సదరు యూపీఐ లావాదేవీని వెనక్కి తీసుకోవడానికి బాధితులు, నష్టపోయినవారు ఏం చేయాలో చూద్దాం.నిజానికి క్షణంలో పూర్తయ్యే ఈ యూపీఐ లావాదేవీల్లో ఒక్కసారి నగదు బదిలీ అయిపోతే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టమే. అందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ ‘యూపీఐ ఆటో`రివర్సల్’ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ దీనిపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విూ యూపీఐ లావాదేవీని రివర్స్ చేయడానికి విూరు విజ్ఞప్తి చేసుకోవచ్చు.
ఇలా చేయండి;ఒకవేళ విూరు పొరపాటున నగదును పంపించింది బంధువులు, స్నేహితులు లేక తెలిసినవారికో అయితే వారికి కాల్ చేసి జరిగిన విషయాన్ని వివరించండి. ఆ నగదును తిరిగి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేయండి.విూ ప్రమేయం లేకుండా నగదు లావాదేవీ జరిగినట్టు విూ దృష్టికి వస్తే, వెంటనే విూకు ఖాతా ఉన్న బ్యాంక్ శాఖకు, లేదా విూ యూపీఐ సర్వీస్ ప్రతినిధులకు తెలియజేయండి. ఇది చాలాచాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. అలాగే లావాదేవీ రిఫరెన్స్ నంబర్, తేదీ, చెల్లించిన మొత్తం వివరాలను బ్యాంక్ ఇవ్వండి. ఆలస్యం చేసినకొద్దీ నష్టపోయే అవకాశాలు పెరుగుతాయన్నది మరువద్దు.విూ లావాదేవీ షరతులకు లోబడి ఉంటే, విూ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ (గూగుల్ పే, ఫోన్ పేటీఎం తదితర పేమెంట్ యాప్స్) అంగీకరిస్తే యూపీఐ ఆటో`రివర్సల్ ప్రక్రియ ఆరంభమవుతుంది. అయితే ఇది పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే విూ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ నుంచి విూకు ధ్రువీకరణ వస్తుంది. ఈ పని విజయవంతమైతే విూ ఖాతాలో సదరు నగదు మొత్తం తిరిగి జమవుతుంది.
చివరగా;ఎవరికైనాసరే నగదును పంపే ముందు అన్ని వివరాలను నిశితంగా గమనించండి. అలాగే యూపీఐ లావాదేవీ పెండిరగ్ లేదా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే విూ ఖాతా నుంచి తగ్గిన మొత్తం మళ్లీ తిరిగొచ్చేందుకు అవకాశం ఉంటుంది. విజయవంతమైన లావాదేవీని తిరిగి వెనక్కి తీసుకోలేము. ఇక యూపీఐ పిన్ నంబర్ భద్రంగా ఉంచుకోవాలి. ఎవరికీ తెలియజేయరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మన వాళ్లెవరికైనా పిన్ తెలియజేసినైట్టెతే సదరు లావాదేవీ ముగిసిన వెంటనే ఆ పిన్ నంబర్ మార్చి కొత్తదాన్ని సెట్ చేసుకోవాలి.
0 కామెంట్‌లు