Ticker

6/recent/ticker-posts

Ad Code

అంగన్వాడీ లను అరెస్ట్‌ చేసిన పోలీసులు

మైలవరం సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ )కనీస వేతన చట్టం అమలు కోరుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్ధమైన అంగన్వాడీ మహిళల ను పోలీసులు అడ్డుకొని బలవంతం గా పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు.న్యాయమైన అంగన్వాడీ కార్యకర్తల కోరికలు నెరవేర్చాల్సిన ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం దారుణమని  అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేసారు.  అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తల కు సీఐటియూ నాయకులు చాట్ల సుధాకర్‌ మద్దతు ప్రకటించారు.  అహర్నిశలు చాకిరీ చేసే అంగన్వాడీ ల కి కనీసం వేతనాలు ఇవ్వాలని కోరితే మహిళలు అనే కనీస ఇంగితం లేకుండా పోలీసుల తో అరెస్టులు చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజ్యాంగ విలువలని కాలరాస్తున్నారని చాట్ల సుధాకర్‌ ద్వజమెత్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు