సూర్యాపేట సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ); సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం, నేమ్మికల్ ఎస్సి కాలనీ లో దారుణం జరిగింది. సోమవారం తెల్లవారుజామున.. ఓ చర్చి పక్కన ఒక ఆడ బిడ్డకి జన్మనిచ్చిని మహిళ బిడ్డను వదిలి పెట్టి వెళ్ళిపోయింది. స్థానికులు ఐసిడిఎస్, పోలిసులకు సమాచారం ఇచ్చారు. శిశువు ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.