తిరుపతి, సెప్టెంబర్ 14, (ఇయ్యాల తెలంగాణ ); ఏపీలో బంగారం, దాని అనుబంధ ఖనిజాల తవ్వకాల కోసం గనులు కేటాయించాలని ఎన్ఎండీసీ దరఖాస్తు చేసుకుంది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ గనులు ఉన్నాయని గుర్తించారట.. అక్కగ గనుల బ్లాకుల్ని కేటాయించాలని కోరినట్లు తమ వార్షిక నివేదికలో తెలిపింది.కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పెరవలి, బేతపల్లితో పాటుగా చిత్తూరు జిల్లా రాజగొల్లపల్లి, నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాలెం గనుల బ్లాకులను కేటాయించాలని కోరారట. ఏపీలోని గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునే అవకాశం కల్పించాలని కూడా కోరారు.గనులకు సంబంధించి ఎన్ఎండీసీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కర్ణాటలో బంగారం, వజ్రాల గనుల్ని నిర్వహిస్తోంది.. తాజాగా ఏపీలో కూడా బంగారం గనులు తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ఎండీసీ చిత్తూరు జిల్లాలో ఇప్పటికే బంగారం గనిని నిర్వహించేందుకు ఈ వేలంలో కూడా పాల్గొంది. చిగర్గుంట`బైసంతానం బంగారం గనిని నిర్వహించేందుకు ప్రిఫర్డ్ బిడ్డర్‌గా రంగంలోకి దిగింది. ఇప్పటికే రెండు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.48 కోట్లు చెల్లించింది. అలాగే రూ.12.39 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించింది.చిత్తూరు జిల్లా చిగర్కుంట` బైసంతానం గనిలో త్వరలోనే తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇప్పుడు నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్త గనులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. మరోవైపు ఎన్ఎండీసీ బంగారు గనుల తవ్వకాల కోసం దాదాపు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోందట. ఇప్పటికే చిత్తూరు జిల్లా చిగర్కుంట` బైసంతానం గనిలో తవ్వకాలకు సిద్ధమవుతోందట.అంతేకాదు ఇనుప ఖనిజం ఉత్పత్తి, రవాణాను అధిక మొత్తంలో నిర్వహించేందుకు వీలుగా రవాణా, పంపిణీ సదుపాయాలను ఎన్ఎండీసీ లిమిటెడ్ విస్తరిస్తోంది. అందుకే బైలదిలా` నాగర్నార్ స్లర్రీ పైప్‌లైన్‌ను విశాఖపట్నం వరకూ పొడిగించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలోని గనిలో 1.83 మిలియన్ టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా వేస్తున్నారట. ప్రతి టన్నుకు 5.15 గ్రాముల బంగారం ఉన్నట్లు అంచనా వేశారట.
మూడు జిల్లాల్లో బంగారు గనులు
గురువారం, సెప్టెంబర్ 14, 2023
0
Tags