రాజమండ్రి సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ): రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు చంద్రబాబును నారా భువనేశ్వరి కలిసారు. తరువాత ఆమె విూడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నిర్బంధించారు ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉండాలి. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడు అనేవారు. చంద్రబాబు నిర్మించిన నిర్మాణంలోనే ఆయన్ని కట్టిపడేశారు. టిడిపి ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ అది ఎక్కడికి పోదు ఎవరు ఏమి చేయలేరు. ఆయన చూసి వచ్చాక ఒక భాగం వదిలేసినట్టు ఉంది. ఏపీ నీ నెంబర్ వన్ గా నిలబెట్టాలని జీవితాన్ని దార పోశారు. చంద్రబాబు భద్రతపై నాకు భయంగా ఉంది. అయనకు సరైన వసతులు కల్పించడం లేదని ఆమె అన్నారు.