మెదక్ సెప్టెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటంలో భాగంగా మనోహరాబాదులో నూతనంగా నిర్మించిన పీహెచ్ సీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి ,జిల్లా కలెక్టర్ రజహర్షి షా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మనోహరాబాద్ లో పీహెచ్ సీ ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనోహరాబాద్ మండలం చేయాలని దశాబ్దల కల ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. ఈరోజు మనోహ రా బాద్ మండలమైంది ఈ మండలంలో 24 గంటలు పనిచేసే పీ హెచ్ సీ ప్రారంభించుకుంటున్నాం. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉంటుంది. గర్భిణీలకు చెకప్ లు కూడా ఇక్కడ జరుగుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మనోహరాబాద్ మండలం అయ్యేదా ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా. త్వరలో మనోహ రాబాద్ కి పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిల్లో 76% డెలివరీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ తెచ్చి డెలివరీ అయ్యాక ఆటోలో ఇంటి దగ్గర దింపుతున్నామన్నారుఈరోజు పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతుంది అంటే కేసీఆర్ కృషివల్లే సాధ్యమైంది. తాగడానికి మంచినీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చాయంటే కేసీఆర్ కృషివల్లే. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా? ఈ రోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి .. పనిచేసిన కేసీఆర్ని ఆశీర్వదించాలని అన్నారు.
0 కామెంట్‌లు