సిద్ధిపేట జిల్లాలోBJPకి భారీ షాక్
శనివారం, సెప్టెంబర్ 09, 2023
0
సిద్దిపేట, సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ లో చేరారు. హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు తమ అనుచరులతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సమక్షంలో దాదాపు 60 మంది బీఆర్‌ఎస్ లో చేరారు. అనంతరం పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలోకి విూ అందరికీ స్వాగతం. తెలంగాణ అంటే గంగా జమున తెహజీబ్ లా కేసీఆర్ నిలిపారు. రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి మత కల్లోహాలు లేకుండా కాపాడుతున్నారు. దేశంలోనే మన రాష్ట్రంలోమాత్రమే మైనార్టీలు భద్రంగా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిద్రపోని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. మన దగ్గర సీఎం కేసీఆర్ ఉండబట్టే శాంతి భద్రతలు ఉన్నాయి. అన్ని వర్గాలను కాపాడుకునే, అన్ని మతాలను గౌరవించే నాయకుడు కేసిఆర్. దసరా, బతుకమ్మ పండుగలప్పుడు హిందువులకు, రంజాన్ మాసంలో ముస్లింలకు, క్రిస్టమస్ సమయంలో క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేస్తారు. దేశంలో మైనార్టీల విద్య కోసం ఎంత ఖర్చు చేస్తారో, వారి కోసం ఎన్ని స్కూళ్లు ఉన్నాయో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని ఉన్నాయి. ముస్లిం సోదరుల కోసం అజ్మీర్ దర్గాలో తెలంగాణ హౌస్ కట్టిస్తూ అండగా నిలిచారు. అలాగే సిద్దిపేటను జిల్లా చేసి, గోదావరి జలాలను తెచ్చి ఇప్పుడు సిద్దిపేటకు రైలు కూడా తెచ్చి అభివృద్ధి చేసి సిద్దిపేటను ఆదర్శంగా నిలిపింది ముఖ్య మంత్రి కెసిఆర్. ముస్లిం మైనారిటీలకు బీఆర్‌ఎస్ రక్షణ కల్పిస్తుందని అన్నారు.
Tags