హైదరాబాద్ సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు.. బీఆర్‌ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చేస్తున్న నాటకాలను గమనిస్తున్నారని.. దీనికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు.శనివారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరాంజన్ దాస్, , సిర్పూర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ, బండల రామచంద్ర రెడ్డి తో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.. వారికి కండువాలు కప్పి కేంద్రమంత్రి స్వాగతించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై అన్ని వర్గా ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణం ఉంది. అనేక సర్వేల్లో బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి పాలవ్వడం ఖాయమని చెప్తున్నాయి. ఓటమి భయంతో కేసీఆర్ బిజెపి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం గౌరవ ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. రుణమాఫీ జరగలే. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు యడం లేదు. దవాఖాన్లలో ఆరోగ్య శ్రీ అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి నెలకొంది. నరేంద్ర మోదీ గారి సుపరిపాలనతో ప్రపంచంలోనే అతిపెద్ధ ఆర్థిక శక్తిగా భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది. కేసీఆర్ పాలనలో అవినీతి తప్ప.. అభివృద్ధి కాలేదు. కేసీఆర్ కుటుంబం బంగారు కుంటుంబంగా మారింది తప్ప.. బంగారు తెలంగాణ కాలేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్ పార్టీకి వేసినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ఆ పార్టీ నుంచి గెలిచినోళ్లు కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయి బీఆర్‌ఎస్ లో చేరుతారని అన్నారు కాంగ్రెస్ .. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోంది. వాళ్లు 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణ సమాజం నమ్మదు. కర్ణాటకలోనూ గ్యారెంటీల పేరుతో నమ్మించి భస్మాసుర హస్తంగా కుచ్చుటోపీ పెట్టింది. దేశాన్ని 60 ఏండ్లు పాలించి దోపిడీ చేసి గ్రావిూణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఏరకంగా దోచుకోవాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబరు 1న మహబూబ్ నగర్, 3న ఇందూరుకు విచ్చేస్తున్నారు. సుమారు రూ. 20 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు. అనేక సంవత్సరాలుగా పెండిరగ్ లో ఉన్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేలా పాలమూరు, ఇందూరు ప్రజలకు వరాలు ప్రకటించనున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అక్టోబరు 1వ తేదీ ఉ. 9 గం.ల నుంచి 10 గం.ల వరకు దేశంలోని ప్రతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రతి కాలనీ, బస్తీలోని ప్రజలంతా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా. దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ రి తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు ప్రజాగర్జన సభ, ఇందూరు ప్రజాగర్జన సభలను విజయవంతం చేయాలని కోరుతున్నానని అన్నారు.
0 కామెంట్‌లు