Ticker

6/recent/ticker-posts

Ad Code

అధికారంలోకి వస్తామనే భావనతో పనిచేయాలి BJP రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ): భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న భావనతో ముందుకు వెళ్లాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రాష్ట్రస్ధాయి సమావేశానికి దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె అనేక విషయాలను ప్రస్తావించారు. వివిధ జిల్లాల  పార్టీ అధ్యక్షులు, జిల్లాల ఇంఛార్జిలు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో  దగ్గుబాటి పురందేశ్వరి ప్రధాన ప్రసంగం చేశారు. జిల్లా స్ధాయిలో  కార్యక్రమాల రూప కల్పన పార్టీ సంస్ధాగత నిర్మాణం అదేవిధంగా పోలింగ్‌ బూత్‌ స్ధాయి వరకు పార్టీ విస్తరణకు అవలంభించాల్సిన అంశాలు ప్రస్తావిస్తునే మండల స్ధాయిలో కార్యకర్తలతో సీనియర్‌ నేతలు మమేకం కావాలని కార్యకర్త ఆధారిత పార్టీ బిజెపి అందువల్ల ఆవిషయాలను మనసులో పెట్టుకుని పార్టీని  క్షేత్ర స్ధాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్‌ విూడియా మాధ్యమం ద్వారా  పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయవలసిన అవసరం ఉందన్నారు అదేవిధంగా  ఐటి విభాగం కూడా  బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా సర్పంచ్‌ ల సమస్యల పై జిల్లాస్ధాయిలో జరిగిన ఉధ్యమం వల్ల సర్పంచ్‌ ల సమస్యల విషయంలో  బజెపి బలంగా వాణిని వినిపించగలిగామన్నారు.నాభూమి..నామట్టి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా  సెప్టెంబర్‌ 17 నుండి అక్టోబర్‌ 2 వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయని వాటి ని విజయవంతం చేద్దాం అన్నారు. క్షేత్రస్ధాయిలో  శక్తి కేంద్రాలను బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు చేశారు.జిల్లాస్ధాయి పదాధికారులకు వివిధ రకాల భాద్యతలు ఇవ్వడం ద్వారా  క్షేత్రస్ధాయి నాయకత్వాన్ని కార్యక్రమంలో  భాగస్వామ్యం చేయడం ద్వారా పని వేగం పెంచినట్లు అవుతుందన్నారు. సమావేశంలో  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  బిట్ర శివన్నారాయణ, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, సాగి కాశీ విశ్వనాధరాజు,  దయాకర్‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు