హైదరాబాద్, సెప్టెంబర్ 1, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. అధిష్టానం సూచనలతో ముందుకు వెళుతూ చేరికలపై దృష్టి సారించింది. అయితే, కృష్ణా యాదవ్ చేరిక అంశం మరోసారి బీజేపీ నేతల మధ్య దూరం పెంచింది. ఆయన జాయినింగ్‌ను పార్టీలోని కొందరు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్టు సమాచారం. దీంతో అయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం సందిగ్ధంలో పడిరది. తాజాగా.. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ చేరిక వ్యవహారం బీజేపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30న చేరేందుకు సిద్ధం అయ్యారు. ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తనమంది మార్భలానికి కూడా సమాచారం ఇచ్చుకున్నారు. భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.అయితే అదే రోజు బీజేపీలో చేరేందుకు బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు చేరారు. ఆయన చేరికకు సంబంధించి బీజేపీ నుంచి విూడియాకు సమాచారం వచ్చింది. అయితే కృష్ణ యాదవ్‌కి సంబంధించి మాత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి సమాచారం లేదు. కృష్ణా యాదవ్ తాను చేరుతున్నట్టుగా విూడియా కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే కృష్ణ యాదవ్ చేరికను బీజేపీలోని బడా నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.. హైదరాబాద్‌కు చెందిన నేతలే ఆయన చెరికను అడ్డుకుంటున్నట్టు సమాచారం.
ఆయన గతంలో అంబర్పేట్ నుండి ప్రాతినిధ్యం వహించడం.. ఇప్పుడు కూడా ఆ సీట్‌నే ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నరేంద్ర ఉన్నన్ని రోజులు కృష్ణా యాదవ్ పోటీగా ఉండేవారు.. ఆ రెండు ఫ్యామిలీలు వైరం కొనసాగుతూనే ఉందని సమాచారం.. అంతేకాకుండా కృష్ణా యాదవ్ గత చరిత్రపై కూడా బీజేపీలో చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే, కృష్ణా యాదవ్ ను పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నం చేసింది ఈటల రాజేందర్.. పూర్తి స్థాయిలో డిస్కషన్ పార్టీలో జరగకుండానే ఆయన జాయినింగ్ తేదీని ఖరారు చేసినట్టు సమాచారం..ఈ క్రమంలో చేరికపై స్పష్టత రాకపోవడంతో కృష్ణయాదవ్ తన సహచరులు, అనుచరులు అందరినీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సవిూపంలోని ఒక గార్డెన్ కి రమ్మని సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడ సమావేశం అవ్వడంతో చివరి వరకు టెన్షన్ కొనసాగింది. ఆ తర్వాత వారంతా చర్చించుకుని వెళ్లిపోయారు. తాజాగా జరిగిన ఈ పరిణామంతో బీజేపీ నేతల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని.. ఇది పార్టీ చేరికలపై ప్రభావం పడుతుందని టాక్ వినిపిస్తోంది.