జగిత్యాల, సెప్టెంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) : జగిత్యాల అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిజెపి నాయకులు డా.ఎడమల శైలేందర్ రెడ్డి హైద్రాబాద్ లోని బిజెపి కార్యాలయంలో దరఖాస్తు చేశారు. శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తూ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డా.శైలేందర్ రెడ్డి తన అప్లికేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా డా.శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వతహాగా వైద్యుడిగా నియోజకవర్గ ప్రజలకు సూపరిచితుడనన్నారు. బీజేపీలో చేరిన నాటి నుంచి ప్రజల మధ్యలో ఉంటూ బిజెపి లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు చేరువలో ఉన్నానన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ తన దరఖాస్తును పరిశీలించి పోటీకి అవకాశం ఇస్తే విజయం సాధించేందుకు అందరి సహకారంతో కృషిచేస్తానని డా.శైలేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట సారంగాపూర్ మండల అద్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కోశాధికారి కొక్కిన సత్యం గౌడ్, కోటగిరి వినయ్ కుమార్, బండపల్లి రాజశేఖర్, బద్దం వేణుగోపాల్ రెడ్డి లు ఉన్నారు.
0 కామెంట్‌లు