శ్రీశైలం సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ): నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం శ్రీశైలం నియోజకవర్గం బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సుండి పెంట రింగ్ పార్కు దగ్గర అక్రమ అరెస్టును నిరశిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.చంద్ర బాబు నాయుడు మచ్చలేని నాయకులు అని, ఆయన ఏటువంటి తప్పు చెయ్యకపోయినా, పెట్టిన కేసులో ఏటువంటి ఆధారాలు లేకపోయినా,73 ఏళ్ల వయస్సులో ఆ మహా మనిషిని రాజకీయ కక్ష్యతో, అధికారం వుంది కదా అని సీఐడీ, పోలీస్ వ్యవస్థలను వాడుకొని బాబు గారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని, మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రభుత్వం మారితే ముఖ్యమంత్రి పరిస్తితి ఎంత దారుణంగా వుంటుందో తెలుసుకోవాలని, బాబు గారినీ బయటికి వదిలేంత వరకు కూడా ఈ రిలే నిరాహారదీక్షలు అనేవి చేస్తూనే వుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.