Ticker

6/recent/ticker-posts

Ad Code

Assam లో బహు భార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లు ?


గౌహాతి, సెప్టెంబర్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : అస్సాంలోని డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓ కీలకమైన బిల్లును ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అస్సాంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. టిన్‌సుకియాలో తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేస్తామని చెప్పారు. అలాగే డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే శనివారం జరిగిన ఈ సమావేశంలో అస్సాం ప్రభుత్వం బహుభార్యత్వం అనే బిల్లును చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఇప్పటికే దీనిపై ఒక లీగల్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చేయాల్సిందిగా కమిటీకి సూచించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఈ అంశంపై ప్రజాభిప్రాయలను కూడా సేకరించామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం 149 నుంచి ఈ అభిప్రాయం తీసుకోగా వారిలో 146 మంది ఈ బిల్లుకు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. అలాగే మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వానికి మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఈ బిల్లును రూపొందించడమే తమ తర్వాతి కార్యచరణని పేర్కొన్నారు. అంతేకాదు వీలైతే రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌ను కూడా అంతం చేసేలా ఈ బిల్లులో మరికొన్ని అంశాలను చేరుస్తున్నామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారులు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే చివరి నిర్ణయం అని చెప్పారు. ఈ నెల చివరికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు