
మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అరెస్ట్ చేసినందుకు డోన్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతూ, పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది, అందుకు డోన్ డి యస్ పి శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నాయకులను అరెస్ట్ చేసారు, డోన్ టీడీపీ అభ్యర్థి మన్నే సుబ్బరెడ్డి పోలీస్ స్టేషన్లో డి యస్ పి తో మాట్లాడి తన పూచి పైన టీడీపీ నాయకులను స్టేషన్లో నుంచి వెంటనే విడుదల చేయించారు, ఈ సందర్బంగా డోన్ టీడీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి విూడియా తో మాట్లాడుతూ నంద్యాల లో మా టీడీపీ జాతీయ నాయకులు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నీ , దారుణంగా 1000 మంది పోలీస్ సిబ్బంది తో అరెస్ట్ చేయడం దారుణం,అనవసరంగా ఆయన పైన లేనిపోని 17 కేసులు పెట్టి అర్ద రాత్రి అరెస్ట్ చేసారు, అందుకే రాష్ట్రము అంతటా నిరసనలు ధర్నా చేపట్టినందుకు చేపట్టారు,మా నాయకులు చంద్రబాబు ను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రము అంతటా అగ్ని గుండం గా మారిపోతుంది, అందుకు పోలీస్ వారు భాద్యులు అవుతారు, అనీ సుబ్బారెడ్డి అన్నారు,ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు చాటకొండ శ్రీనివాస్ లు, మురళి గౌడ్, మల్లికార్జున రెడ్డి,వలసల రామకృష్ణ, గంధం శ్రీనివాస్,సలీంద్ర శ్రీనివాస్ యాదవ్, యువ నాయకులు గౌతమ్ తదితరులు రెడ్డి తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు