Ticker

6/recent/ticker-posts

Ad Code

7 గంటలకు ఖైరతాబాద్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27, (ఇయ్యాల తెలంగాణ ):ఈ ఏడాది ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి కూడా  సాగర్‌లో కలిసిపోనున్నాడు. ఖైరతాబాద్‌లో దశ మహా విద్యాగణపతికి వీడ్కోలు పలికేందుకు...  విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్‌లో పూజలందుకున్న శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జనం.. గురువారం  ఉదయం 11గంటల 30 నిమిషాలకు జరుగుతుందని భాగ్యనగర్‌  ఉత్సవ కమిటీ ప్రకటించింది. శోభాయాత్ర  ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటిచింది. ఈరోజు బాలానగర్‌ నుంచి భారీ ట్రాలీ ఖైరతాబాద్‌ చేరుకోనుంది.  అర్థరాత్రి 12గంటలకు చివరి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒంటి గంట తర్వాత బడా గణపయ్యను.. ప్రతిష్టించిన స్థానం నుంచి కదిలిస్తారు. ఆ తర్వాత... అర్ధరాత్రి ఒంటి  గంట నుంచి 2 గంటల వరకు చిన్న విగ్రహాలను ట్రాలీపైకి ఎక్కిస్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు భారీ వినాయకుడిని ట్రాలీపై తీసుకొచ్చే ప్రక్రియ  జరుగుతుంది. ఆ తర్వాత వెల్డింగ్‌ పనులు చేస్తారు. ఉదయం 7గంటలకు ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం విూదుగా శోభాయాత్ర సాగుతుంది. నెమ్మదిగా కదులుతూ  ఉదయం తొమ్మిదున్నర గంటలకు బడా గణపయ్య ఎన్టీఆర్‌ మార్గ్‌ చేరుకుంటాడు. ఉదయం పదిన్నరకు అక్కడ వెల్డింగ్‌ పనులు జరుగుతాయి. ఆ తర్వాత 11గంటల వరకు  వరకు పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. 11గంటల 30 నిమిషాలకు ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. దీంతో శ్రీ దశ మహా విద్యా గణపతిగా  కొలువుదీరిన ఖైరతాబాద్‌ మహాగణనాధుడి నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుంది.

 రేపటి నిమజ్జనానికి ఈ సాయంత్రం నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్న కారణంగా... ఈ  సాయంత్రం నుంచి ఖైరతాబాద్‌ గణపయ్య దర్శనాలు నిలిపివేస్తున్నారు. గణేష్‌ శోభాయాత్రకు హైదరాబాద్‌ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు ప్రధాన చెరువుల దగ్గర నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లో ఈసారి 90 వేల గణేష్‌ విగ్రహాలను ఏర్పటుకాగా.. ట్యాంక్‌ బండ్‌లో 30 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నిమజ్జనానికి సంబంధించి... భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు పోలీసులు. శోభాయాత్ర జరిగే మార్గాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఖైరతాబాద్‌ బడా గణేష్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు మొత్తం 21 కిలోవిూటర్ల మేర శోభాయాత్ర  జరగనుంది. దీంతో ఆయా మార్గాల్లో నిఘాపెట్టారు. ఓల్డ్‌సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘా  నీడలోకి తీసుకొచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నారు. శోభాయాత్ర, నిమజ్జనాలను  బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పరిశీలించబోతున్నారు. శోభాయాత్ర జరిగే రూట్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చార్మినార్‌, మక్కా మసీదు సహా  ఓల్డ్‌ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. హుస్సేన్‌సాగర్‌, ట్యాంక్‌బండ్‌పై స్పెషల్‌ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.  మహిళలకు ఇబ్బంది ఎదురుకాకుండా షీ టీమ్స్‌, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. 

విగ్రహానికి క్యూ ఆర్‌ కోడ్లుభాగ్యనగరం హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికి ఓ ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. సిటీలో దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధి, గణేష్‌ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి అందిస్తున్నారు. అంతేకాకుండా విగ్రహాలను జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్‌ కోడ్స్‌, జియో ట్యాగింగ్‌ డేటాను పోలీసు అధికారిక యాప్‌ టీఎస్‌ కాప్‌కు అనుసంధానం చేశారు. దీంతో విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు జరిగే తంతును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలించే అవకాశం ఉంది. అంతే కాకుండా సామాన్యుడి నుంచి పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను స్మార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడిరది.  శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్‌ మండపం నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం? 4 వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయి. గురువారం  దశమహా విద్యాగణపతిని నిమజ్జనం జరుగనుంది.భారీ బందోబస్తునిమజ్జనం బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్‌ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్‌ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆర్టీ, యాంటీ చైన్‌ స్నాచింగ్‌, షీ?టీమ్స్‌ బృందాలతో పాటు డాగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్‌ పరిధిలోని 56 చెరువుల్లో నిమజ్జనాలు జరుగనున్నాయి. ఈ మేరకు 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని చెరువుల వద్ద ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించారు. రూట్‌ టాప్‌, షీ టీమ్స్‌, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశారు.ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో భక్తుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రద్దీకి నుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్‌ సర్వీసులను అదనంగా నడపనున్నారు. మెట్రో సైతం భక్తుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. బస్సుల వివరాల కోసం  ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు