మిర్యాలగూడ సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ); మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ ముందు అంగన్వాడి ఆయాల టీచర్ల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. నెలకు 26 వేల రూపాయలు టీచర్లకు, 20 వేల రూపాయలు ఆయాలకు పిఎఫ్, ఈఎస్ఐ, లాంటి సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని సమ్మె మూడు రోజుల నుంచి చేపట్టిన 78 శాతం మంది రోడ్లవిూదకి వచ్చి సమ్మెను నిర్వహించారు. న్యాయమైన నిర్ణయం తీసుకొవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడి టీచర్లకు ఆయాలకు సిపిఐ, సిపిఎం ఎం సిపియు, కాంగ్రెస్ పార్టీల నేతలు మద్దతు పలికారు.
మద్దతు పలికిన సిపిఐ, సిపిఎం, ఎం సిపిఐ, కాంగ్రెస్