విజయవాడ, సెప్టెంబర్ 5,(ఇయ్యాల తెలంగాణ ); భారత్ ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచంలోని అగ్రదేశాల తో పోటీ పడుతూ వివిధ రంగాల్లో రాణిస్తోంది. సాంకేతికంగానూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా స్టార్టప్ లను ఏర్పాటు చేయడంలో ఏపీలోని మూడు నగరాలు దూసుకెళ్తున్నట్లు తాజాగా నాస్కామ్ అందించిన నివేదికలో పేర్కొంది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలు ఐటీ పరిశ్రమలో దూసుకెళ్తున్నట్లు పేర్కోంది. దేశంలోని 26 టెక్ హబ్ జాబితాలో ఈ మూడు నగరాలు ఉన్నాయని, ఇక్కడ టెక్ సంస్థలు ఏర్పాటు చేయడానికి అనువైన వాతావరణం ఉందని తెలిపింది.డెలాయిట్, నాస్కామ్ నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టెక్ హబ్ లు ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొత్త కార్యాలయాలు, ఫర్నీచర్ ఏర్పాటు చేసుకోవాలంటే 50 శాతం పెట్టుబడి పోతుంది. ఇక మానవ వనరులు సవిూకరించుకోవడానికి 60 శాతం వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఏపీలోని విశాఖ పట్నంలో టెక్ హబ్ లు ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు నాస్కామ్ తెలిపింది. ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. రహేజా ఐటీ టవర్ ను ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఇవే కాకుండా కొత్త తరం టవర్లను చాలా మంది ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. రిషి కొండలోని 5 ఎకరాల స్థలంలో ఐటీ స్టార్టఫ్ ఎన్ క్లేవ్ ను అభివృద్ధి చేయాలని రాష్ట్రం భావిస్తోంది.కేంద్ర ప్రభుత్వం టైర్ 2, టైర్ 3 నగరాల్లో స్టార్టప్ లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని వైజాక్, విజయవాడ, కాకినాడ, తిరుపతి నగరాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయని నాస్కామ్ తెలపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు శ్రీధర్ లంక మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సవిూప భవిష్యత్ లో టైర్ 2, టైర్ 3 గనరాల్లో గణనీయమన అభివృద్ధి జరగనుందని, ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. డీప్ టెక్ నైపుణ్య పౌండేషన్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ మెగా నగరాలు తరుచూ అదిక వ్యయాన్ని ఆశిస్తాయి. కానీ ఏపీలోని ఈ ప్రాంతాల్లో స్వల్ప వ్యయంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.ఇండియాలో కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుంచి చాలా మంది పేపర్ లెస్ వర్క్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతిక పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతీ పనిని డిజిటైలేషన్ చేయడంతో స్టార్టప్ ల అవసరం ఏర్పడుతోంది. ఇదే సమయంలో కొన్ని ఐటీ కంపెనీలు కొత్త వారిని చేర్చుకునేందుకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంతో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారంతా బహుళ జాతి కంపెనీల్లో చేరిపోయారు. వీరి నైపుణ్యంతో టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ టైర్ 2 నగరాలను టైర్ 1 కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
0 కామెంట్‌లు