హైదరాబాద్ సెప్టెంబర్ 4 (ఇయ్యాల తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.కాగా, సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటికితోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. మోపాల్ మండలంలో 15.7 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లిలో 14.2, జక్రాన్‌పల్లి 13.8, సిరికొండలో 13.5 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్`బస్వపూర్ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఇక సిరికొండ మండలంలో కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్ వద్ద లోలెవల్ బ్రిడ్జ్‌పై వాహనాలను అధికారులు నిలిపివేశారు.కామారెడ్డి జిల్లా రాజాంపేట, బీబీపేట, మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మాచారెడ్డి, బిక్కనూర్, దోమకొండ మండలాల్లో కుండపోతగా వానపడిరది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గాంధారి మండలంలో 14.4 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. సదాశివనగర్‌లో 12, జుక్కల్‌లో 11.7 సెంటీవిూటర్ల వర్షం కురిసింది.
0 కామెంట్లు