Ticker

6/recent/ticker-posts

Ad Code

27 లక్షలు పలికిన Balapur లడ్డూ


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (ఇయ్యాల తెలంగాణ) : ఎప్పటిలానే ఈసారి కూడా బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంలో మరోసారి రికార్డు ధర పలికింది. రూ. 27 లక్షలకు దాసరి దయానంద్‌ రెడ్డి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.  హైదరాబాద్‌ గణేష్‌ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ గణపతి ఎంత ఫేమస్సో... బాలాపూర్‌ లడ్డూ వేలం కూడా అంతే ఫేమస్‌. అందుకే గణేష్‌ నిమజ్జనం టైంలో బాలాపూర్‌ లడ్డూ ఎవరు పాడారు. ఎంతకు పాడారు అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతూ ఉంటుంది. ఈసారి కూడా బాలాపూర్‌ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఈ ఏడాది బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలంపాటలో 36 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికితే ఈసారి అంతకు మించిపోయింది. 27 లక్షల రూపాయలకు తుర్కయాంజల్‌కు చెందిన  దాసరి దాయనంద్‌ రెడ్డి దక్కించుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వేలాంపాటలో పాల్గొనాలనే వాళ్లంతా ఉత్సవ కమిటీకి ముందుగానే ఇవ్వాలని తీర్మానించారు.   గత ఏడాది వేలంలో రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూను బాలాపూర్‌ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2021లో బాలాపూర్‌ లడ్డూ రూ. 18.90 లక్షలు పలుకగా.. 2022లో ధర 5.70 లక్షలు అధికంగా పలికింది. అయితే, బాలాపూర్‌ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. 1994లో రూ. 450లతో మొదలయ్యింది ఈ లడ్డూ వేలం పాట. కరోనా సమయంలో తప్ప 28 ఏళ్ల పాటు ఈ వేలం పాట సాగింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ.. కొన్న వారి కొంగు బంగారంగా నిలుస్తోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది.వాస్తవానికి 1994 నుంచి 2001 వరకు బాలాపూర్‌ లడ్డూ వేలల్లోనే పలికింది. కందాడ మాధవ రెడ్డి అనే వ్యక్తి పోటీపడి 2002లో రూ. 1.05 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2003లో లక్షన్నరకు పైగా పలికిల ధర ఆ తర్వాత సంవత్సరం నుంచి ధర పెరుగుతూ వస్తోంది. స్థానికుడు రఘునందనచారి 2007లో రూ. 4.15 లక్‌షలకు వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. 

2015లో బాలాపూర్‌ లడ్డూ రూ. 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్‌ మోహన్‌ రెడ్డి రూ.10.32 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.2016లో రూ. 14.65 లక్షలకు పెరిగింది బాలపూర్‌ లడ్డూ ధర. మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్‌ రెడ్డి 2016లో రూ. 14.65 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2018లో స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్‌ గుప్తా రూ. 16.60 లక్షలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఆ తరువాత కొలను రాంరెడ్డి 2019లో రూ.17.60 లక్షలకు వేలం పాడి బాలాపూర్‌ లడ్డును దక్కించుకున్నారు. కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి.. ఆ లడ్డూను సీఎంకు అందజేశారు.ఏపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ నాదర్గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డితో కలిసి 2021లో రూ. 18.90 లక్షలకు బాలాపూర్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు. సాధారణంగా లడ్డూ వేలంపాటను నిర్వహించి వచ్చిన డబ్బును స్థానిక గణేష్‌ కమిటీ నిర్వహణలో.. మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇప్పటి వరకు రూ. 1,44,77,000 బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూకి వేలం పాటలో లభించింది. లడ్డూ వేలానికి ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్‌ లడ్డూ వేలం సొమ్ముతో.. ఇప్పటివరకూ గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు కూడా ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి, ఆ ప్రాంత అభివృద్దికి మరింత ఖర్చు చేస్తున్నారు.ఏ సంవత్సరంలో ఎంత ధర పలికింది..1994 ? కొలన్‌ మోహన్‌ రెడ్డి ? రూ. 450.1995 ? కొలన్‌ మోహన్‌ రెడ్డి ? రూ. 4,500 2022 వంగేటి లక్ష్మారెడ్డి ? రూ. 24,60,0002023  దాసరి దయానంద్‌ రెడ్డి ? రూ. 27 లక్షలుబాలాపూర్‌ గణేషుడి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటలకు బాలాపూర్‌ గణేష్‌ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటి సభ్యులు. ఊరు బొడ్రాయి వద్దకు వచ్చాక మరోసారి బాలాపూర్‌ గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. 9 గంటల సమయంలో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. గత సంవత్సరం రూ. 24.60 లక్షలు పలికి లడ్డూ ధర.. ఈసారి అంతకు మించి రూ. 27 లక్షలు పలికింది. బాలాపూర్‌ లడ్డును దాసరి దయానంద్‌ రెడ్డి రూ. 27 లక్షలకు సొంతం చేసుకున్నారు. లడ్డు వేలంను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.. బాలాపూర్‌ గణేషుడిని వాహనంపైకి ఎక్కించారు. బాలపూర్‌ గ్రామంలో ఊరేగించనున్నారు. 2, 3 గంటల వరకు గణేషుడి ఊరేగింపు కొనసాగనుంది. ఊరు బొడ్రాయి వద్దకు వచ్చాక ప్రత్యేక పూజలు చేసి వేలం పాట స్టార్ట్‌ చేస్తారు. మేళ తాళాలతో బాలాపూర్‌ గణేషుడిని ఊరేగిస్తున్నారు నిర్వాహకులు. గణేషుడిని చూసేందుకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు. అయితే, ఈ సారి లడ్డూ వచ్చిన వారి, తీసుకున్న వారి పేర్లను వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి సంవత్సరం బాలాపూర్‌ లడ్డూను ‘హనీ ఫుడ్స్‌’ అందజేస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు