న్యూ డిల్లీ సెప్టెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ); కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూపొందించిన వ్యాక్సిన్ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని కొవిడ్`19 వ్యాక్సిన్‌పై బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక బూస్టర్ డోస్ తర్వాత తాను ఆసుపత్రిపాలైనట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్) సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.ప్రపంచవ్యాప్తంగా కొవిడ్`19 వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతోందని, కొన్ని దేశాలు వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేశాయని పేర్కొంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ‘కొత్త జాతులు, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కారణంగా సమర్థత మారుతుందని నేను భావిస్తున్నాను. ఎవరైనా ఇది 100 శాతం ప్రభావవంతంగా ఉందని చెప్పడం మూర్ఖత్వమే. ఏ వ్యాక్సిన్ 100 శాతం పూర్తి ప్రూఫ్ కాదు’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్..‘ప్రజలు తప్పనిసరిగా టీకా, మల్టిపుల్ బూస్టర్‌లను తప్పనిసరిగా తీసుకోవాలి అనే దారుణమైన డిమాండ్ గురించే నా ఆందోళనంతా. అది గందరగోళంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సుప్రీంకోర్టు చెల్లదని చెప్పే వరకు.. స్పేస్ ఎక్స్, అనేక ఇతర కంపెనీలు టీకాలు వేయించుకునేందుకు నిరాకరించిన వారిని తొలగించవలసి వచ్చేది. సిబ్బందిపై వ్యాక్సిన్ విధివిధానాలను ప్రైవేట్ కంపెనీలు బలవంతంగా అమలు చేసే విధానాలను పాటించడం కంటే జైలుకు వెళ్లడమే మేలు. నా విషయానికొస్తే.. వ్యాక్సిన్ ముగిసేలోపు నాకు అసలు కొవిడ్ వచ్చింది (తేలికపాటి జలుబు లక్షణాలు). మూడు వ్యాక్సిన్ డోస్‌లు తీసుకున్నా. మూడో షాట్ నన్ను దాదాపు ఆసుపత్రిపాలు చేసింది. అదే వ్యాక్సిన్ తీసుకోని వారి విషయానికొస్తే.. నొవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో గ్రాండ్‌స్లామ్‌లు గెలిచారు. ఇలా మాట్లాడుతున్నానంటే, నాకు టీకాలపై నమ్మకం లేనట్లు కాదు. నేనూ టీకా తీసుకున్నాను. అయినప్పటికీ.. నివారణ వ్యాధి కంటే అధ్వాన్నంగా ఉండకూడదు కదా’ అంటూ ఎలాన్ మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
0 కామెంట్‌లు